గ్రూపు రాజకీయాలు సహించేది లేదు...ఏ ఒక్కరూ మినహాయింపు కాదన్న చంద్రబాబు
- పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- వైసీపీని గద్దె దించేందుకు జనం కసిగా ఉన్నారన్న బాబు
- గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టమని హెచ్చరిక
తెలుగు దేశం పార్టీలో గ్రూపు రాజకీయాలను ఇకపై సహించేది లేదంటూ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదని కూడా ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే గడువు ఉందన్న చంద్రబాబు పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు.
ఇటీవలే ముగిసిన టీడీపీ మహానాడును ప్రస్తావించిన చంద్రబాబు... అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా కసిగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూపు రాజకీయాలు పార్టీకి తీరని నష్టం చేస్తాయన్న చంద్రబాబు... ఆ తరహా చర్యలకు పాల్పడరాదని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ శ్రేయస్సును పక్కనపెట్టి గ్రూపు రాజకీయాలకు దిగే నేతలు ఎవరైనా కూడా సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.