ఆత్మగౌరవ దీక్షను చేపడుతున్న కోదండరామ్

  • ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారన్న కోదండరామ్  
  • తెలంగాణ మరో శ్రీలంక అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్య 
  • కేసీఆర్ పాలనలో ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారన్న ప్రొఫెసర్ 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ నిరంకుశ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారని చెప్పారు. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ మరో శ్రీలంక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

కేసీఆర్ విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఆత్మగౌరవ దీక్షను చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. వరంగల్ లో 24 వేల ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం యత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని.. దీంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని అన్నారు.


More Telugu News