'పక్కా కమర్షియల్'కి గుమ్మడికాయ కొట్టేశారు!
- మారుతి మార్కు కామెడీతో 'పక్కా కమర్షియల్'
- గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా
- సంగీత దర్శకత్వం వహించిన జేక్స్ బిజోయ్
- జులై 1వ తేదీన సినిమా విడుదల
గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఆ తరువాత మాత్రం చకచకా లాగిస్తూనే వచ్చారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేశారు. ఈ సినిమా టీమ్ గుమ్మడికాయ కొట్టేసి .. కేక్ కట్ చేశారు.
గోపీచంద్ సరసన కథానాయికగా రాశి ఖన్నా నటించిన ఈ సినిమాను, యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2వారు నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతి మార్క్ కామెడీతో ఈ సినిమా నడుస్తుందని చెబుతున్నారు.
రాశి ఖన్నా గతంలో ఇటు మారుతి దర్శకత్వంలోను .. గోపీచంద్ జోడీగాను చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో చేయడం మాత్రం ఇదే ఫస్టు టైమ్. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఇక గోపీచంద్ కూడా ఈ సినిమా హిట్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. జులై 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.