ఈ దర్శకుడు నాకు కాల్ చేసినప్పుడు కుదరదని చెప్పాను: వేణు తొట్టెంపూడి

  • 'దమ్ము' తరువాత సినిమాలకి దూరమైన వేణు  
  • పదేళ్ల తరువాత రవితేజ సినిమాతో రీ ఎంట్రీ 
  • పోలీసాఫీసర్ పాత్రలో నటించిన వేణు 
  • ఈ 29న రిలీజ్ అవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
హీరోగా కొన్ని మంచి సినిమాలు చేసిన వేణు తొట్టెంపూడి, ఆ తరువాత హఠాత్తుగా సినిమాలకి దూరంగా వెళ్లాడు. పదేళ్ల  తరువాత 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సీఐ మురళి పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ .. " సినిమాల పట్ల నాకున్న ప్రేమ ఎంత మాత్రం తగ్గలేదు. కాకపోతే కొన్ని కారణాల వలన సినిమాలను పక్కన పెట్టవలసి వచ్చింది. ఈ సినిమా దర్శకుడు శరత్ మండవ నాకు కాల్ చేసినప్పుడు కూడా కుదరదనే చెప్పాను. అయినా వదలకుండా వచ్చి నన్ను కలిశాడు.

ఈ సినిమా కథ ఏమిటి? అందులో నా పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ పాత్రకి గాను నన్నే అనుకోవడానికి కారణం ఏమిటి? అనేది చెప్పాడు. దాంతో నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవలసి వచ్చింది. రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం  ఆనందంగా ఉంది. ఆయన ఒక పవర్ హౌస్ లాంటి హీరో. సెట్లో తనతో పాటు అందరూ ఎనర్జీతో ఉండేలా చేయడం ఆయన ప్రత్యేకత" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News