'వారసుడు'కి విలన్ కూడా సెట్ అయినట్టే!

  • విజయ్ తెలుగులో చేస్తున్న 'వారసుడు'
  • తమిళ టైటిల్ గా 'వరిసు' ఖరారు
  • కథానాయికగా కనిపించనున్న రష్మిక మందన్న  
  • విలన్ పాత్ర కోసం ఎస్.జె.సూర్య ఎంపిక 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన 
విజయ్ ఇంతకుముందు తమిళంలో చేసిన సినిమాలు తెలుగులోను విడుదలయ్యేవి. అందుకు భిన్నంగా ఈ సారి ఆయన తెలుగులో చేసిన సినిమా తమిళంలోను విడుదల కానుంది. రజనీ .. కమల్ ... విక్రమ్ .. సూర్య వంటి స్టార్స్ తో పోలిస్తే,  మొదటి నుంచి కూడా విజయ్ టాలీవుడ్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం కనిపిస్తుంది.

తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో వరుసగా విడుదల కావడమనేది ఈ మధ్యనే జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ఒక తెలుగు సినిమా కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ  పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. కథానాయికగా రష్మికను తీసుకోవడం కూడా జరిగిపోయింది.    

తమిళంలో ఈ సినిమాకు 'వరిసు' అనీ .. తెలుగులో 'వారసుడు' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రకిగాను ఎస్.జె.సూర్యను ఎంపిక చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఆయన ఎంపిక దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. మరో వైపున చరణ్ - శంకర్ సినిమాలోను విలన్ గా ఆయన పేరే వినిపిస్తోంది. ఈ విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.


More Telugu News