నేను సోనియాకు మాత్రమే ఏజెంట్ ను... మరెవరికీ కాదు: శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ కౌంటర్

  • రేవంత్ కు మాణికం ఠాగూర్ ఏజెంట్ అన్న శశిధర్ రెడ్డి
  • అధిష్ఠానానికి, రాష్ట్రానికి మధ్య వారధినన్న ఠాగూర్
  • నేతల కంటే పార్టీయే ముఖ్యమని వెల్లడి
  • తెలంగాణ ఇన్చార్జిగా ప్రియాంక వస్తే సంతోషమేనని స్పష్టీకరణ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, రేవంత్ రెడ్డికి మాణికం ఠాగూర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ స్పందించారు. తాను సోనియా గాంధీకి మాత్రమే ఏజెంట్ నని, మరెవరికీ ఏజెంట్ ను కానని స్పష్టం చేశారు. 

టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమేనని, నేతల కంటే పార్టీయే ముఖ్యమని ఉద్ఘాటించారు. తెలంగాణ పరిస్థితులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్రానికి మధ్య వారధి లాంటి వాడినని మాణికం ఠాగూర్ వెల్లడించారు. 

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు సన్నిహితుడని, తన నివాసానికి ఆహ్వానించి బిర్యానీతో విందు ఇచ్చాడని చెప్పారు. బీజేపీలోకి వెళ్లినవారే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా ప్రియాంక గాంధీ వస్తే సంతోషమేనని తెలిపారు.


More Telugu News