మరీ ఇంత దిగజారకూడదు: సిద్ధరామయ్యపై బసవరాజ్ బొమ్మై మండిపాటు
- ఆరెస్సెన్ ను నిషేధించాలన్న సిద్ధరామయ్య
- పీఎఫ్ఐపై నమోదైన కేసులను ఎత్తేసిన ఘనత కాంగ్రెస్ ది అన్న బొమ్మై
- దేశ భక్తిని పెంచేందుకు కృషి చేస్తున్న సంస్థ ఆరెస్సెస్ అని వ్యాఖ్య
ఆరెస్సెస్ ను బ్యాన్ చేయాలంటూ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్య అనడం దురదృష్టకరమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పీఎఫ్ఐను ఎందుకు నిషేధించారని అడిగే నైతిక హక్కు కూడా కాంగ్రెస్ కు లేదని చెప్పారు. పీఎఫ్ఐపై నమోదైన కేసులను గతంలో ఎత్తేసిన ఘనత కాంగ్రెస్ దని అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఆరెస్సెస్ పై నిషేధం విధించాలని అంటున్నారని దుయ్యబట్టారు.
ఆరెస్సెస్ ను బ్యాన్ చేయాలని అంటారే కానీ... ఎందుకు బ్యాన్ చేయాలో మాత్రం చెప్పరని విమర్శించారు. ఈ దేశానికి ఆరెస్సెస్ ఎంతో చేసిందని... ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేదలు, నిరుపేదలు, అణగారిన వర్గాలను ఆదుకునేందుకు ఎన్నో సంస్థలను ఆరెస్సెస్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజల్లో దేశ భక్తిని పెంచేందుకు కృషి చేస్తున్న సంస్థ ఆరెస్సెస్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఈ స్థాయికి దిగజారుతారని అనుకోలేదని చెప్పారు.