డబ్బు కోసం మేము స్టూడియోను నిర్మించలేదు: అల్లు అర్జున్
- ఈరోజు అల్లు రామలింగయ్య శత జయంతి
- అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన కుటుంబ సభ్యులు
- స్టూడియో నిర్మాణం తాత గారి కోరిక అన్న బన్నీ
ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు, ఆయన పేరుతో నిర్మించిన అల్లు స్టూడియోస్ ను ఈరోజు ప్రారంభించారు. అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, తమ తాతగారి 100వ పుట్టినరోజు తమకు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. స్టూడియోను నిర్మించాలనేది తాతగారి కోరిక అని... ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోను నిర్మించామని తెలిపారు. అల్లు అరవింద్ కు సొంత సినీ నిర్మాణ సంస్థ ఉందని, స్థలాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, స్టూడియో పెట్టడం ఆయనకు పెద్ద సమస్య కాదని కొందరు అనుకొని ఉండొచ్చని చెప్పారు. డబ్బుకోసం స్టూడియోను తాము నిర్మించలేదని... తాత గారి కోరిక తీర్చేందుకు నిర్మించామని తెలిపారు. ఈ స్టూడియోలో షూటింగ్ లు బాగా జరగాలని అన్నారు. ఈ స్టూడియో ద్వారా ఇండస్ట్రీకి మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నానని చెప్పారు.