'పీఎస్1' ప్రభంజనం.. 8 రోజుల్లోనే రూ. 325 కోట్ల వసూళ్లు
- ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్తున్న చిత్రం
- ఈ వారాంతంలో రూ. 350 కోట్ల మార్కు దాటే అవకాశం
- యూఎస్ఏలో 5 మిలియన్ల మార్కు దాటిన పీఎస్1
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పీఎస్1' తొలి వారంలో అద్భుతమైన బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా తమిళ్, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ ధృవీకరించారు. ఈ వారాంతంలో రూ. 350 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేశారు.
'రోబో 2.0', 'కబాలి', 'బిగిల్', 'విక్రమ్' తర్వాత రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన ఆరో తమిళ సినిమా ఇదేనని త్రినాథ్ తెలిపారు. 'కబాలి', 'రోబో 2.0' ఓవరాల్ బాక్సాఫీస్ కలెక్షన్లను అధిగమించిన ఈ చిత్రం 'విక్రమ్' రికార్డును కూడా బ్రేక్ చేసే దిశగా ముందుకెళ్తోంది. విదేశాల్లోనూ 'పీఎస్1' హవా కొనసాగుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం 5 మిలియన్ల క్లబ్లో చేరింది. రజనీకాంత్ 'రోబో 2.0' చిత్రం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తమిళ మూవీగా నిలిచింది.