భార్యల మార్పిడి గేమ్‌కు నిరాకరించిందని.. భార్యను బంధించి దారుణానికి ఒడిగట్టిన భర్త

  • 5 స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న నిందితుడు
  • భార్యను హోటల్‌లో బంధించి ‘భార్యల మార్పిడి గేమ్’కు డిమాండ్
  • రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన ఘటన  
భార్యల మార్పిడి గేమ్ ఆడేందుకు నిరాకరించిన భార్యపై ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమ్మర్ అనే వ్యక్తి బికనేర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యను హోటల్‌కు తీసుకొచ్చి ఆమె వద్దనున్న సెల్‌ఫోన్ లాక్కుని గదిలో బంధించాడు. భార్యల మార్పిడి గేమ్ ఆడాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. 

అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మర్‌కు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, రూ. 50 లక్షల అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News