ఫుట్ బాల్ ప్రేమికుల కోసం జియో రూ.222 డేటా ప్లాన్

  • 30 రోజుల వ్యాలిడిటీతో 50జీబీ 4జీ డేటా
  • రెగ్యులర్ ప్లాన్ లో రోజువారీ డేటా అయిపోయిన తర్వాత వినియోగంలోకి
  • వాడుకోకపోయినా 30 రోజుల తర్వాత ఎక్స్ పైర్
ఫిపా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. మొదటి నుంచి రసవత్తరంగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటప్పుడు మొబైల్ డేటా చాలకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రిలయన్స్ జియో ప్రత్యేకంగా డేటా ప్లాన్ ను ప్రకటించింది. 

రూ.222తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 50జీబీ డేటా లభిస్తుంది. రెగ్యులర్ ప్లాన్ తో దీనికి సంబంధం లేదు. ఇది కేవలం అదనపు డేటాను ఇచ్చే రీచార్జ్ ప్లాన్ మాత్రమే. అంటే ఒక జీబీ డేటాకు రూ.4.44 ఖర్చు చేస్తున్నట్టు అవుతుంది. రెగ్యులర్ ప్లాన్ లో రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత.. ఈ ప్రత్యేక డేటా ప్లాన్ ఉపయోగంలోకి వస్తుంది. ఒక్కరోజులో కావాలంటే 50 జీబీని వాడుకోవచ్చు. కేవలం ఫుట్ బాల్ కోసమే అని కాకుండా, ఓటీటీ కంటెంట్ వీక్షణకు సైతం ఈ డేటాను వాడుకోవచ్చు. జియో యూజర్లు అందరికీ ఇది అందుబాటులో ఉంది.


More Telugu News