ఏపీ మద్యం దుకాణాల్లో ఇక డిజిటల్ చెల్లింపులు
- ఆన్ లైన్ పేమెంట్స్ ను ప్రారంభించిన ఆబ్కారీ శాఖ
- తొలుత 11 దుకాణాల్లో అమలు
- మరో 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు
- డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ కు అదనపు చార్జీలు నిల్
- క్రెడిట్ కార్డు చెల్లింపులకు నిబంధలకు లోబడి చార్జీలు
ఏపీ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమైంది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ నేడు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. తొలివిడతలో 11 మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఉంటాయని రజత్ భార్గవ వెల్లడించారు. అనంతరం, 3 నెలల్లో అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెడతామని చెప్పారు.
మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల కోసం ఎస్ బీఐ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు అదనపు చార్జీలు ఉండవని రజత్ భార్గవ స్పష్టం చేశారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రం నిబంధనల ప్రకారం చార్జీలు ఉంటాయని తెలిపారు.