ఢిల్లీ మద్యం కుంభకోణం.. వైసీపీ ఎంపీ కుమారుడి అరెస్ట్
- మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అదుపులోకి తీసుకున్న సీబీఐ
- అంతకుముందు ఆయనను ప్రశ్నించిన అధికారులు
- నేటి మధ్యాహ్నం రాఘవను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్న అధికారులు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలనం నమోదైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇటీవల అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయనను ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించింది. అనంతరం రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది.
నేటి మధ్యాహ్నం రాఘవను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపరిచి కస్టడీకి అనుమతి కోరనున్నారు. కాగా, ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం మల్హోత్రా అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు రాఘవను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నారు.