ఢిల్లీ టెస్టులోనూ అశ్విన్ హవా... కష్టాల్లో ఆసీస్

  • టీమిండియా, ఆసీస్ రెండో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 3 వికెట్లు తీసిన అశ్విన్
  • స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీలను డకౌట్ చేసిన వైనం
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా స్పిన్నర్ల హవా కొనసాగుతోంది. ఢిల్లీలో నేడు ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టును రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టాడు. అశ్విన్ 3 వికెట్లు తీయగా... ఆస్ట్రేలియా 168 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

తొలుత మార్నస్ లబుషేన్ (18)ను అవుట్ చేసిన అశ్విన్ అదే ఓవర్లో చివరిబంతికి ప్రమాదకర స్టీవ్ స్మిత్ (0)ను డకౌట్ చేసి టీమిండియా శిబిరంలో మరింత ఉత్సాహం నింపాడు. ఆ తర్వాత మరోసారి విజృంభించి ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (0)ని కూడా డకౌట్ చేసి ఆసీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. 

ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 56 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు. పీటర్స్ హ్యాండ్స్ కోంబ్ 36, కెప్టెన్ పాట్ కమిన్స్ 23 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో షమీ 2, జడేజా 1 వికెట్ తీశారు.


More Telugu News