రోడ్డుపై సభ వద్దని చంద్రబాబుకు చెప్పాం: డీఐజీ పాలరాజు

  • నిన్న చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు
  • తాము అనుమతి ఇవ్వకపోయినా చంద్రబాబు సభ పెట్టారన్న డీఐజీ
  • ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని వెల్లడి
  • టీడీపీ నేతలు తమ మాట వినలేదని ఆరోపణ
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడారు. తాము పర్మిషన్ ఇవ్వకపోయినా చంద్రబాబు సభ పెట్టారని ఆరోపించారు. ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. రోడ్డుపై సభ ఏర్పాటు చేయొద్దని చెప్పామని, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పామని వివరించారు. కానీ టీడీపీ నేతలు పోలీసుల మాట వినకుండా సభ పెట్టారని డీఐజీ తెలిపారు. పోలీసు వాహనం అద్దాలు పగులగొట్టారని వెల్లడించారు. 

నిన్న అనపర్తిలో టీడీపీ సభ ఏర్పాటు చేయగా, అనుమతి లేదంటూ పోలీసులు చంద్రబాబును బలభద్రపురం వద్దే అడ్డుకోవడం తెలిసిందే. దాంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలకుండా పోలీసులు తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టారు. పోలీసులు కూడా రోడ్డుపైనే బైఠాయించారు. అయితే చంద్రబాబు కాలినడకన అనపర్తి చేరుకుని సభలో పాల్గొన్నారు.


More Telugu News