భద్రాచలంతో తారకరత్నకు ప్రత్యేక అనుబంధం
- భద్రాద్రి రామయ్యను రెండుసార్లు దర్శించుకున్న తారకరత్న
- ‘భద్రాద్రి రాముడు’ సినిమాలోని ముఖ్య సన్నివేశాలు భద్రాచలంలోనే చిత్రీకరణ
- షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో ఫొటోలు
- గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్న భద్రాద్రి అభిమానులు
23 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన నందమూరి తారకరత్నకు భద్రాచలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. భద్రాద్రి రామయ్యను ఆయన రెండుసార్లు దర్శించుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆయన నటించిన ‘భద్రాద్రి రాముడు’ సినిమాలోని కీలక ఘట్టాలను గోదావరి, కరకట్ట, రామాలయం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.
ఆ సమయంలో అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. యూనిట్ మొత్తం అక్కడ ఉండడంతో షూటింగ్ జరిగినన్నాళ్లు ఆ ప్రాంతం ఎంతో సందడిగా ఉండేది. తారకరత్నను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. షూటింగ్ గ్యాప్‌లో వారితో కలిసి తారకరత్న ఫొటోలు దిగేవారు. తారకరత్న మృతి విషయం తెలిసిన అక్కడి అభిమానులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.