అదిరిపోయే లుక్, ఫీచర్లతో రియల్ మీ సీ55 ఫోన్!
- ఇండోనేషియా మార్కెట్ లో కొత్త ఫోన్ రిలీజ్ చేసిన రియల్ మీ
- తొలిసారిగా ‘మినీ క్యాప్సూల్’ ఫీచర్ పెట్టిన కంపెనీ
- 64 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఆకర్షించే డిజైన్
- త్వరలో ఇండియాలోనూ సేల్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు
‘రియల్ మీ’ కంపెనీ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సీ సిరీస్ లో ‘సీ55’ మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇండోనేషియాలో ఈ రోజు ఫోన్ ను రిలీజ్ చేసింది. 64 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఆకర్షించే డిజైన్ తో రూపొందించింది. రియల్ మీ ఇండోనేషియా వెబ్ సైట్ లో రేపటి నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది.
రియల్ మీ సీ55 ఫోన్ లో 6.72 ఇంచుల హెచ్ డీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఐఫోన్ 14 ప్రోలో ఏర్పాటు చేసిన ‘డైనమిక్ ఐలాండ్’ మాదిరి.. ‘మినీ క్యాప్సూల్’ ఫీచర్‌ను పెట్టారు. ఈ ఫీచర్ తో రియల్ మీలో వస్తున్న తొలి ఫోన్ ఇదే.
ఆండ్రాయిడ్ 13తో కూడిన ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 6జీబీ-128 జీబీ మోడల్ ధర ఇండోనేషియాలో సుమారు రూ.13,300 కాగా, 8జీబీ-256 జీబీ వేరియంట్ ధర రూ.16 వేలుగా నిర్ణయించారు. రెయినీ నైట్, సన్ షవర్ కలర్లలో ఇవి లభ్యం కానున్నాయి.
ఫోన్ లో మీడియా టెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా పెట్టారు. 1 టెర్రాబైట్ దాకా మెమొరీని పెంచుకోవచ్చు. సైడ్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెట్టారు. త్వరలోనే భారతదేశంలోనూ ఈ ఫోన్ సేల్స్ ప్రారంభించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది.