అవకాశం అడిగితే ముఖం చాటేస్తారు: రఘు కుంచె
- బుల్లితెరపై యాంకర్ గా రాణించిన రఘు కుంచె
- నటుడిగా .. సంగీత దర్శకుడిగా గుర్తింపు
- ఎవరినీ ఛాన్స్ అడగనని చెప్పిన రఘు
- అందుకు గల కారణాల వివరణ
యాంకర్ గా .. నటుడిగా .. సంగీత దర్శకుడిగా రఘు కుంచె తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక వైపున సంగీత దర్శకుడిగా చేస్తూనే, మరో వైపున అడపా దడపా నటిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ .. "ఇండస్ట్రీలో నాకు ఎవరూ శత్రువులు లేరు. నా వరకూ ఎలాంటి వివాదాలు రాలేదు. అందుకు కారణం నాకు నచ్చనివారికి నేను దూరంగా ఉంటూ రావడమే" అన్నారు.
"నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చినవారు చాలామంది మంచి పొజీషన్ కి వెళ్లారు. 'నువ్వు అడిగితేనే కదా నీకు అవకాశాలు వచ్చేది' అని వాళ్లు అంటారు. అడగడానికి ఎలాంటి నామోషీ లేదు .. ఒకసారి అడుగుతాను .. రెండోసారి గుర్తుచేస్తాను .. మూడోసారి అడిగితే దొబ్బేస్తున్నాడని అనుకుంటారు. ఆ ఫీలింగ్ కూడా మనకి తెలిసిపోతుంటుంది" అని చెప్పాడు.
"అవకాశం అడుగుతూ వెళితే ఎవైడ్ చేయడం మొదలుపెడతారు .. ముఖం చాటేస్తారు. మనతో ఇన్నేళ్లుగా తిరిగినవారు ముఖం చాటేసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు అడగడం ఎందుకూ అని అడగను అంతే. నాకు సంబంధించిన క్లిప్స్ ఏమైనా పంపిస్తే కూడా స్పందించరు. ఎందుకంటే ఏ వేషమో అడుగుతాననీ .. మ్యూజిక్ డైరెక్షన్ అడుగుతానేమోననేది వారి ఆలోచన కావొచ్చు. కానీ నిజానికి నేను ఆ స్టేజ్ ను దాటిపోయాను" అని చెప్పుకొచ్చారు.