అందమే ఐశ్వర్యం .. ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ పిక్స్!
- కోలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మీనన్
- కన్నడలోను అవకాశాలను దక్కించుకున్న బ్యూటీ
- 'స్పై' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
- నిఖిల్ జోడీగా మెరవనున్న సుందరి
తమిళనాడుకి చెందిన చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ కి పరిచయం కావాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఈ విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంటారు. అలాంటి భామలతో ఒకరిగా ఐశ్వర్య మీనన్ కనిపిస్తుంది. టీనేజ్ లోనే ఈ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చక్కని కనుముక్కుతీరుతో ఆకట్టుకున్న ఈ సుందరి, కోలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ అనుకున్నంత స్పీడ్ గా అయితే ఆమె తన కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తించలేకపోయింది. కాకపోతే కన్నడ సినిమాలు కూడా కొన్ని చేయగలిగింది. ఈ పదేళ్ల కెరియర్ లో ఆమె టాలీవుడ్ వైపుకు రాకపోవడం ఆశ్చర్యం. అలాంటి ఐశ్వర్య మీనన్ ఇప్పుడు నిఖిల్ 'స్పై' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వదిలిన ఆమె పిక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు సందడి చేస్తున్నాయి. మంచి ఫిట్ నెస్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ, ఇక్కడ ఎంతవరకూ సక్సెస్ అవుతుందనేది చూడాలి.