వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

  • ఈ నెల 16న విచారణకు రావాలంటూ నోటీసులు
  • హైదరాబాదులో ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని స్పష్టీకరణ
  • వివేకా హత్య కేసులో అవినాశ్ ను అనుమానితుడిగా భావిస్తున్న సీబీఐ!
  • ఇప్పటికే మూడుసార్లు విచారించిన వైనం
వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. రేపు హైదరాబాదులో విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ స్పష్టం చేసింది. 

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను సీబీఐ ఇప్పటికే మూడుసార్లు విచారించింది. అరెస్ట్ భయంతో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కొట్టివేసింది.


More Telugu News