ఇవాళో రేపో కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన: రణ్‌దీప్ సుర్జేవాలా

  • సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచన
  • డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశం
  • రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం!
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రోజు లేదా రేపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా బుధవారం చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నాలుగైదు రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే పార్టీ సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.

సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని సిద్ధూ వైపు మొగ్గు చూపుతున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం మాజీ ముఖ్యమంత్రికే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజో రేపో ప్రకటన వెలువడగానే గురువారం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.


More Telugu News