తెరుచుకోని విమానం తలుపులు.. కాక్‌పిట్ విండోలోంచి లోపలికి దూరిన పైలట్
- అమెరికాకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో వెలుగు చూసిన ఘటన
- ప్రయాణికుడి కారణంగా విమానం తలుపులకు లోపలి నుంచి గడియ
- మరోమార్గంలేక కిటికీలోంచి కాక్‌పిట్‌లోకి దూరి తలుపులు తెరిచిన పైలట్
- ఘటన తాలూకు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్
ప్రయాణికుడి తప్పిదం కారణంగా ఓ విమానం తలుపులు తెరుచుకోలేదు. దీంతో, పైలట్ విమానం కాక్‌పిట్ కిటికీ లోంచి లోపలికి దూరి తలుపులు తెరవాల్సి వచ్చింది. కిటికీలోంచి పైలట్ లోపలికి దూరుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మే 24న శాన్ డియేగో అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.
అంతకుమునుపు ఆ విమానం నుంచి చివరిగా దిగిన ప్రయాణికుడి పొరపాటు కారణంగా విమానం తలుపులకు లోపలి నుంచి గొళ్లెం పడిపోయింది. దీంతో, వాటిని తెరవడం సిబ్బందికి సాధ్యపడలేదట. మరోమార్గం లేక పైలట్ కాక్‌పిట్ కిటికీలోంచి దూరి తలుపులు తెరిచాడట. పైలట్ నిబద్ధత కారణంగా విమానం షెడ్యూల్ ప్రకారం బయలుదేరిందని ప్రయాణికులు తెలిపారు.