మెట్రో కోసం కేటీఆర్‌కు రంగారెడ్డి, మేడ్చల్ ప్రతినిధుల విజ్ఞప్తి
- మంత్రి కేటీఆర్‌కు ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేల అభ్యర్థన
- ప్రాజెక్టుల డీపీఆర్‌ల కోసం అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యేలు
- మెట్రోతో పర్యాటకం, వాణిజ్యం పెరుగుతాయని, ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయన్న ఎమ్మెల్యేలు
నగర ప్రజల విశేష ఆదరణ పొందుతున్న మెట్రో రైలు సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు.
ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో పొడిగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు.