భోళా మేనియా పాట విడుదల చేసిన దేవిశ్రీ... థ్యాంక్స్ తమ్ముడూ అంటూ చిరంజీవి రిప్లయ్
- చిరంజీవి హీరోగా భోళాశంకర్
- మెహర్ రమేశ్ దర్శకత్వం
- నేడు ఫస్ట్ సింగిల్ విడుదల
- మహతి స్వరసాగర్ సంగీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
- ఆలపించిన మహతి స్వరసాగర్, రేవంత్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం భోళాశంకర్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నేడు రిలీజైంది. భోళా మానియా అనే ఈ హుషారైన మాస్ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మహతి స్వరసాగర్, రేవంత్ ఆలపించారు.
కాగా, భోళా మేనియా లిరికల్ సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేయడంపై చిరంజీవి స్పందించారు. థాంక్యూ తమ్ముడూ డీఎస్పీ... ఈ పాట డబుల్ కుమ్ముడు ఖాయం అంటూ ట్వీట్ చేశారు.
ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న భోళాశంకర్ చిత్రంలో... చిరంజీవి సరసన తమన్నా కథానాయిక. ఇందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సుశాంత్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, శ్రీముఖి, మురళి శర్మ, సితార, గెటప్ శ్రీను, హైపర్ ఆది, బ్రహ్మాజీ, ఉత్తేజ్, సత్య, తాగుబోతు రమేశ్, వేణు, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్నారు.