ఇండియన్3కి రెడీ అవుతున్న శంకర్, కమలహాసన్!
- ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా చిత్ర బృందం
- వచ్చే జనవరి 18న విడుదల కానున్న సినిమా
- హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్
దిగ్గజ దర్శకుడు శంకర్, దక్షిణాది అగ్ర హీరో కమలహాసన్ కాంబినేషన్ లో కొన్నేళ్ల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఓ క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఇన్నాళ్లకు దానికి సీక్వెల్ గా ఇండియన్ 2 చిత్రం తెరకెక్కుతోంది. పలు అంతరాయాల తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో 20 రోజుల షూటింగ్ మిగిలున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 18న విడుదల చేయాలని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా చేయాలని చిత్ర బృందం చర్చలు జరుపుతోందని నిర్మాతల్లో ఒకరైన ఉదయ్ తెలిపారు. ఇండియన్ 2 చిత్రీకరణలో ఎంతో ఫుటేజ్ వచ్చిందన్నారు. దాన్ని మరో భాగానికి కూడా వాడుకోవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది.