మోదీ పర్యటనకు కేసీఆర్ దూరం.. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారన్న కేటీఆర్

  • రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న మోదీ
  • తెలంగాణపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న కేటీఆర్
  • ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్న
ప్రధాని మోదీ రేపు తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ అని, ఏ మొహం పెట్టుకుని ఆయన తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. 

విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ లోని కోచ్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల కోట్లు ఇచ్చిన మోదీ... తెలంగాణకు కేవలం రూ. 521 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

మరోవైపు రేవంత్ రెడ్డిపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో గాడ్సే దూరాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరెస్సెస్ వ్యక్తి రేవంత్ అని అన్నారు. భూదందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని దుయ్యబట్టారు.


More Telugu News