జగన్ కు దమ్ముంటే ఆ బిల్లులపై స్టిక్కర్ వేయాలి: నారా లోకేశ్
- కందుకూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- వలేటివారిపాలెంలో బహిరంగ సభ
- సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
- మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం
- టీడీపీ వస్తే బంగారు భవిష్యత్తు అంటూ భరోసా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారీ స్పందన లభించింది. 156వ రోజు వెంగళాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్ కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు పడుతూ యువనేతను గ్రామాల్లోకి స్వాగతించారు. వలేటివారిపాలెంలో నిర్వహించిన బహిరంగసభ జన ప్రభంజనాన్ని తలపించింది. రోడ్లన్నీ కిటకిటలాడటంతో జనం డాబాలపైకి ఎక్కి యువనేత ప్రసంగాన్ని ఆలకించారు.
కాగా, కందుకూరు నియోజకవర్గానికి లోకేశ్ రాక సందర్భంగా ఓ పారచ్యూట్ తో ఆయనకు స్వాగతం పలికారు. పసుపు రంగులో ఉన్న పారాచ్యూట్ లోకేశ్ ను దృష్టిని ఆకర్షించింది. దానిని ఆయన ఆసక్తిగా తిలకించారు.
లోకేశ్ ప్రసంగం వివరాలు...
జగన్ కటింగ్ మాస్టర్... ఎలాగంటే...!
జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్ మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.
మహిళలను ఆదుకునేందుకే మహాశక్తి!
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కొట్టేశాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేశాడు.
2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూశా... కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.
మహాశక్తి పథకం కింద... ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
యువత భవితను దెబ్బకొట్టాడు!
జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డీఎస్సీ లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేశాడు. జీవో నెం.77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం రద్దు చేశాడు.
యువత గళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
రైతులను ఆదుకోవడానికే అన్నదాత పథకం
జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్.3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నెంబర్.2.
రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టీడీపీ మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూశా. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం – 2070.1 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 12.8 కి.మీ.*
*157వరోజు (17-7-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*
*కొండపి అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*
సాయంత్రం
4.00 – మాలెపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
5.00 - చెంచుపాలెం రోడ్డులో స్థానికులతో సమావేశం.
5.05 – మూలెవారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
5.35 – మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం.
6.05 – మాలెపాడులో స్థానికులతో సమావేశం.
6.35 – మాలెపాడు వాటర్ ట్యాంకు వద్ద పిచ్చిగుంట సామాజికవర్గీయులతో భేటీ.
7.05 – చుండిమడుగు వాగులో సింగరాయకొండ మండల వాసులతో సమావేశం.
7.35 – చుండుమడుగు వాగులో రైతులతో సమావేశం.
7.55 – తిమ్మపాలెం వాటర్ ట్యాంక్ వద్ద క్రిస్టియన్లతో సమావేశం.
8.05 – తిమ్మపాలెంలో వైసీపీ ప్రభుత్వ బాధితులతో సమావేశం.
8.30 – అంకిరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.
8.20 – బొగనంపాడు వాటర్ ట్యాంకు వద్ద స్థానికులతో సమావేశం.
8.30 – చెరుకువారిపాలెంలో నరేగా కూలీలతో సమావేశం.
9.10 – బోగనంపాడు వాటర్ ట్యాంకు వద్ద స్థానికులతో సమావేశం.
10.00 – చెరువుకొమ్ముపాలెంలో జరుగుమిల్లి మండల ప్రజలతో భేటీ.
10.30 – చెరుకూరివారిపాలెం శివారు విడిది కేంద్రంలో బస.
******