30 రోజులు కావాలని బయట డైలాగులు కొడతారు.. లోపల 30 నిమిషాలైనా కూర్చోరు: కేటీఆర్

  • కాంగ్రెస్, బీజేపీ సభ్యులపై కేటీఆర్ సెటైర్లు  
  • వీళ్ల‌ను ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నారని వ్యాఖ్య  
  • వాళ్ల సంగతి ప్రజలే చూసుకుంటారన్న కేటీఆర్   
ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. స‌భను 30 రోజులు నిర్వ‌హించాల‌ంటూ బయట డైలాగులు కొడతారని, కానీ స‌భ‌లో 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదని విమర్శించారు. అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై నిన్న బీఏసీ స‌మావేశం జ‌రిగిందని చెప్పారు. అసెంబ్లీ స‌మావేశాలను 30 రోజులు జ‌ర‌పాల‌ని బీజేపీ నాయ‌కుడు ఉత్త‌రం రాశారని, కాంగ్రెస్ పార్టీ 20 రోజులు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసిందన్నారు.

కానీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో బీఆర్ఎస్ సభ్యులంతా ఉంటే కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక‌రి చొప్పున మాత్ర‌మే స‌భ‌లో ఉన్నారని తెలిపారు. దీన్ని బ‌ట్టి ప్రతిపక్షాలకు ప్ర‌జ‌ల మీద ఉన్న చిత్త‌శుద్ధి ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ‘బ‌య‌ట‌నేమో 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి అని డైలాగులు.. కానీ సభలో 30 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు.  వీళ్ల‌ను ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నారు. వీళ్ల సంగ‌తేందో ప్ర‌జ‌లే చూసుకుంటారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


More Telugu News