అధ్వానంగా జగన్ పాలన.. హాస్యనటుడు పృథ్వీరాజ్
- పృథ్వీరాజ్ దర్శకత్వంలో ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమా
- బోనకల్లులో సందడి చేసిన చిత్రబృందం
- వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు బుద్ధి చెబుతారన్న పృథ్వీరాజ్
- రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై టాలీవుడ్ హాస్యనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా రూపొందింది. ఈ సినీబృందం నిన్న ఖమ్మం జిల్లాలోని బోనకల్లులో సందడి చేసింది. వీరంతా టీవీ ఆర్టిస్ట్ బానోత్ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వచ్చారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలన అధ్వానంగా ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రపై మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పినట్టే చేశాను తప్పితే వేరే వాళ్లను దృష్టిలో పెట్టుకుని చేయలేదని స్పష్టం చేశారు. కాగా, కొత్త రంగుల ప్రపంచం సినిమాలో హీరోయిన్‌గా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారని పృథ్వీ తెలిపారు.