మాదాపూర్ డ్రగ్స్ పార్టీలో సినీ ఫైనాన్సియర్ సహా ఐదుగురి అరెస్ట్
- అరెస్ట్ అయిన వారిలో సినీ ఫైనాన్సియర్ వెంకట్
- వెంకట్ కదలికలపై మూడు నెలల నుంచి నిఘా
- గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో రేవ్ పార్టీలు
హైదరాబాద్ లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ లోని విఠల్ రావు నగర్ లో ఉన్న వైష్ణవి అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరిగింది. ఈ రేవ్ పార్టీని భగ్నం చేసిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో సినీ ఫైనాన్సియర్ వెంకట్, కె.వెంకటేశ్వర రెడ్డి, డి. మురళితో పాటు ఇద్దరు యువతులు మధుబాల, మేహక్ ఉన్నారు. యువతులను ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన వారి నుంచి కొకైన్, ఎల్ఎస్డీ, గంజాయితో పాటు రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నార్కోటిక్ పోలీసులు వెంకట్ కదలికలపై మూడు నెలలుగా నిఘా పెట్టారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంకట్ వాట్సాప్ చాట్ పరిశీలించారు. డ్రగ్స్ మాఫియాతో వెంకట్ కు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు.