చంద్రబాబు అరెస్ట్ పై సినీ నటుడు సుమన్ స్పందన

  • చంద్రబాబు రాజకీయ నేరస్తుడు కాదన్న సుమన్
  • టైమ్ బాగుంటే ఎవరు అడ్డుకున్నా ఆయన బయటకు వస్తారని వ్యాఖ్య
  • చంద్రబాబు జైల్లో ఉండటం బాధగా ఉందన్న సుమన్
  • చంద్రబాబుకు తెలియకుండానే తప్పు జరిగి ఉండొచ్చని వ్యాఖ్య 
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ నటుడు సుమన్ స్పందించారు. చంద్రబాబు రాజకీయ నేరస్తుడు కాదని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా ఆయన బయటకు రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. టైమ్ ను తాను నమ్ముతానని... ప్రస్తుతం చంద్రబాబుకు టైమ్ బాగున్నట్టు లేదని అన్నారు. చంద్రబాబు టైమ్ బాగుంటే ఎవరు ఎంత అడ్డుకున్నా ఆయన బయటకు వస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కితాబునిచ్చారు. అలాంటి వ్యక్తి జైల్లో ఉండటం బాధను కలగజేస్తోందని చెప్పారు. తమ స్టాఫ్ తప్పు చేసినా అపవాదు తమపైకే వస్తుందని... అలాగే చంద్రబాబుకు తెలియకుండానే తప్పు జరిగి ఉండొచ్చని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం మామూలు విషయం కాదని చెప్పారు.


More Telugu News