ఎన్టీఆర్ భవన్ లో దీక్ష చేపట్టిన బాలకృష్ణ అర్ధాంగి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండులో చంద్రబాబు
- ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ అగ్రనేతల ఒక్కరోజు దీక్షలు
- ఢిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి దీక్ష
- హైదరాబాదులోనూ చంద్రబాబుకు సంఘీభావంగా కుటుంబ సభ్యుల దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా పార్టీ అగ్రనేతలు దీక్ష చేపట్టడం తెలిసిందే. ఢిల్లీలో నారా లోకేశ్, రాజమండ్రిలో నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. కాగా, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర కూడా దీక్ష చేపట్టారు.
చంద్రబాబుకు సంఘీభావం పలుకుతూ ఈ దీక్షలో ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్, తారకరత్న అర్ధాంగి అలేఖ్యా రెడ్డి, నారా రోహిత్ తల్లి ఇందిర, నందమూరి జయశ్రీ, చలసాని చాముండేశ్వరి తదితరులు కూడా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భవన్ లో నిర్వహిస్తున్న ఈ నిరాహార దీక్షలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా హాజరయ్యారు.