రేపు కమలహాసన్ 'ఇండియన్-2' నుంచి ఇంట్రో... తెలుగులో రాజమౌళి చేతుల మీదుగా విడుదల

  • కమల్, శంకర్ కాంబోలో ఇండియన్-2
  • రెండున్నర దశాబ్దాల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్
  • రేపు సాయంత్రం 5.30 గంటలకు ఇంట్రో వీడియో రిలీజ్
లోకనాయకుడు కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా ఇండియన్-2 వస్తోంది.  రెండున్నర దశాబ్దాల తర్వాత ఈ సీక్వెల్ కోసం కమల్, శంకర్ మళ్లీ కలిశారు. చాలాకాలంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. రేపు ఇండియన్-2 నుంచి ఇంట్రో రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగులో రాజమౌళి విడుదల చేయనుండగా, తమిళంలో రజనీకాంత్ చేతులమీదుగా విడుదల చేయనున్నారు. 

నవంబరు 7న కమల్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, రేపు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్-2 ఇంట్రోను చిత్రబృందం కమల్ అభిమానులకు కానుకగా అందించనుంది. కాగా, ఈ ఇంట్రోను కన్నడలో కిచ్చ సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో ఆమిర్ ఖాన్ రిలీజ్ చేస్తున్నారు.


More Telugu News