మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో గాయపడ్డ ఫేస్‌బుక్ అధినేత.. ఎడమకాలికి ఆపరేషన్
- వచ్చే ఏడాది జరగనున్న మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌కు మార్క్ జుకర్‌బుర్గ్ ట్రైయింగ్
- శిక్షణలో ఉండగా ఎడమ మోకాలి లింగ్‌మెంట్‌కు గాయం
- ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స
- సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడించిన జుకర్‌బర్గ్
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీకి సన్నద్ధమవుతున్న ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల శిక్షణ సమయంలో గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆయనకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మార్క్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించడంతో పాటూ తాను ఆసుపత్రి బెడ్‌పై ఉండగా భార్య సపర్యలు చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. ఎడమ మోకాలి వద్ద ఉండే లిగ్ మెంట్‌కు గాయమైనట్టు మార్క్ తెలిపాడు. ఆపరేషన్ కూడా విజయవంతంగా జరిగినట్టు వెల్లడించాడు.
‘‘మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటుండగా గాయమైంది. ఇప్పుడే ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. వచ్చే ఏడాది జరగబోయే మ్యాచ్‌కు ట్రెయినింగ్ తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. గాయం కారణంగా మ్యాచ్‌లో జాప్యం జరుగుతుంది. ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. నాకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అంటూ మార్క్ కామెంట్ చేశాడు. త్వరలో ఎలాన్ మస్క్‌తో మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొంటానని గతంలో మార్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.