వరల్డ్ కప్ ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
  • విజేతకు వరల్డ్ కప్ బహూకరించనున్న ప్రధాని మోదీ
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడుతున్నాయి.  ఈ మ్యాచ్ కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విచ్చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి తన కాన్వాయ్ తో స్టేడియానికి బయల్దేరారు. ఈ మ్యాచ్ లో విజేతకు ప్రధాని మోదీ వరల్డ్ కప్ ను బహూకరించనున్నారు. కాగా, ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పరుగులు చేసేందుకు చెమటోడ్చుతోంది. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోవడంతో భారీ షాట్లు కొట్టడం సాధ్యం కావడంలేదు.


More Telugu News