యువగళం నవశకం విజయోత్సవ సభలో ఆసక్తికర దృశ్యాలు... ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 18తో ముగిసిన లోకేశ్ యువగళం
- పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో నేడు సభ
- రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులు
- చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నాదెండ్ల హాజరు
- సభకు తరలివచ్చిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రద్దీగా కనిపించింది.
టీడీపీ తరఫున ఈ సభకు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, యనమల, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు తదితర నేతలు హాజరు కాగా... జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. సభ ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. ఈ సభకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా తరలి రావడం విశేషం.