నాగపూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
- నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా బహిరంగ సభ
- సభకు హాజరు కానున్న ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలు
- బహిరంగ సభ కోసం నాగపూర్ చేరుకున్న రేవంత్, మల్లు భట్టి, ఉత్తమ్, పొన్నం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహారాష్ట్రలోని నాగపూర్లో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా నాగపూర్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హాజరు కానున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షలమంది వస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో నాగపూర్లో కాంగ్రెస్ శ్రేణులు... రేవంత్ రెడ్డి సహా మంత్రులకు ఘన స్వాగతం పలికారు.