వాణిజ్య కార్యకలాపాలపై తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు

  • పార్టీ ఆఫీసులో టీవీ చానెల్ ఆఫీసు నిర్వహిస్తున్న బీఆర్ఎస్
  • రూల్స్ కు విరుద్ధమంటూ నోటీసులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
  • టీవీ ఛానల్ ఆఫీసును షిప్ట్ చేయనున్న యాజమాన్యం 
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. తెలంగాణ భవన్ లో టీవీ చానల్ నిర్వహించడాన్ని ఈ నోటీసులలో ప్రశ్నించింది.  పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఎప్పటిలోగా ఖాళీ చేస్తారో వారంలోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈమేరకు తెలంగాణ భవన్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి ఈ నోటీసులు పంపింది.

బీఆర్ఎస్ హెడ్డాఫీసు తెలంగాణ భవన్ లో 2011 నుంచి టీవీ ఛానల్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం పార్టీ అధికారంలో ఉండడంతో అధికారులు మౌనాన్ని ఆశ్రయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం చేజారింది. అనంతరం టీవీ ఛానల్ ను మరో భవనానికి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం. కాగా, రెవెన్యూ శాఖ నోటీసులపై తెలంగాణ భవన్ వర్గాలు అధికారికంగా స్పందించలేదు.


More Telugu News