మరోసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు
- రామ్ గోపాల్ వర్మ తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్న కొలికపూడి
- ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన వర్మ
- కొలికపూడిపై కేసు నమోదు చేసిన సీఐడీ
అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి ఏపీ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలిసి విచారణకు వచ్చారు. ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని శ్రీనివాసరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఏపీ డీజీపీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ నెల 3న సీఐడీ విచారణకు కొలికపూడి హాజరయ్యారు. ఈరోజు మరోసారి విచారణకు వచ్చారు.
ఈ సందర్భంగా కొలికపూడి మీడియాతో మాట్లాడుతూ... దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం ఉందని, అందుకే ఎన్నిసార్లు రమ్మన్నా వస్తున్నానని చెప్పారు. సీఎం జగన్ ను కోర్టులు ఎన్నిసార్లు పిలిచినా వెళ్లడం లేదని... వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు. చట్టం మీద గౌరవం ఉంటే కేసులపై విచారణకు జగన్ హాజరు కావాలని డిమాండ్ చేశారు.