విదేశాల్లో భారతీయ విద్యార్థుల మృతిపై వివరాలు తెలిపిన కేంద్రం
- లోక్ సభలో ప్రశ్న అడిగిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్
- లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం
- 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మృతి
- అత్యధికంగా కెనడాలో 91 మంది విద్యార్థుల మృతి
వివిధ దేశాల్లో భారతీయ విద్యార్థుల మృతిపై నేడు కేంద్ర ప్రభుత్వం వివరాలు తెలిపింది. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కెనడాలో 91 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్టు వివరించింది. ఇంగ్లండ్ లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఉక్రెయిన్ లో 21 మంది కన్నుమూసినట్టు తెలిపింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.