సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ముఖ్యమంత్రిపై బాల్క సుమన్ చేసిన విమర్శల వీడియో నెట్టింట వైరల్
- మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
- బాల్క సుమన్‌పై 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదయింది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్‌పై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై ఈరోజు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నేత... రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు.. హౌలేగాడు అంటూ దూషించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ మాటలకు గాను నీకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి తగిన శాస్తి చెబుతారన్నారు.