కడప జైలు నుంచి దస్తగిరి విడుదల
- వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి
- గతేడాది దస్తగిరిపై అట్రాసిటీ, దాడి కేసులు
- 4 నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి
- ఇటీవల రెండు కేసుల్లోనూ బెయిల్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అట్రాసిటీ, దాడి కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో దస్తగిరికి ఇటీవల బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో, దస్తగిరి నేడు కడప జైలు నుంచి విడుదలయ్యాడు.
ఓ ప్రేమ జంట వ్యవహారంలో దస్తగిరిపై అట్రాసిటీ, దాడి కేసులు నమోదు కాగా, గత 4 నెలలుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో, జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య దస్తగిరి పులివెందుల వెళ్లాడు. అంతకుముందు, తన విడుదలపై జైలు గెస్ట్ హౌస్ లో ఉన్న సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు.