ఢిల్లీకి బయల్దేరిన రేవంత్.. సానియా మీర్జాకు టికెట్ దక్కుతుందా?
- ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం
- నాలుగు పెండింగ్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్న హైకమాండ్
- వరంగల్ నుంచి కడియం కావ్య పేరు దాదాపు ఖరారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీకి బయల్దేరారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ హస్తినకు పయనమయ్యారు. వాస్తవానికి ఈ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజుకు వాయిదా పడింది.
రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నారు. ఈ స్థానాలపై కమిటీ మీటింగ్ లో చర్చించి అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్నారు.
వరంగల్ నుంచి కడియం కావ్య పేరు దాదాపు ఖరారయింది. ఖమ్మం టికెట్ కోసం లోకేశ్ యాదవ్, రాజేంద్ర ప్రసాద్... కరీంనగర్ స్థానంలో ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్... హైదరాబాద్ నుంచి సానియా మీర్జా, షహనాజ్ తుబ్సుం పేర్లు పరిశీలనలో ఉన్నాయి.