బీఆర్ఎస్ పేరును మళ్లీ మార్చే ఆలోచన చేస్తున్నారు: ఎర్రబెల్లి దయాకర రావు కీలక వ్యాఖ్య

  • ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
  • ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం
  • అక్రమ కేసులు పెట్టి తనను జైలుకు పంపించినా వెళ్తాను గానీ పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
  • గతంలో రైతుల కోసం జైలుకు వెళ్లానన్న ఎర్రబెల్లి
బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే ఆలోచన చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

అక్రమ కేసులు పెట్టి తనను జైలుకు పంపించినా వెళ్తాను గానీ తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. గతంలో తాను రైతుల కోసం పోలీసులతో లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News