రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే అధికారం: డీఎల్ రవీంద్రారెడ్డి

  • తన మద్దతు టీడీపీ అభ్యర్థికేనన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
  • వైసీపీ ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టీకరణ
  • ‘వివేకం’ సినిమా చూశాక ప్రజలు ఓటు వేయాలని వ్యాఖ్య 
‘వివేకం’ సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందన్న ఆయన తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. 

మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. వివేకం సినిమా చూసి ఓటేయాలని తన వద్దకు వచ్చిన వారికి చెబుతున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాబు పద్ధతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. ‘‘మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ఓటు వేయొద్దు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కే నా మద్దతు’’ అని అన్నారు.


More Telugu News