ఈడెన్ గార్డెన్స్‌లో న‌మోదైన న‌యా రికార్డులు.. పంజాబ్ పేరిట‌ చెత్త రికార్డు!

  • నిన్న‌టి కేకేఆర్, పీబీకేఎస్‌ మ్యాచ్ టీ20 చ‌రిత్ర‌లోనే ఒక సంచ‌ల‌నం
  • టీ20 హిస్ట‌రీలోనే అత్య‌ధిక ర‌న్స్ (262) ఛేజ్ చేసి గెలిచిన జట్టుగా పంజాబ్ కింగ్స్
  • అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక స్కోరు కూడా ఇదే
  • పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు-42
  • ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన జ‌ట్టుగా పంజాబ్ (24)
  • ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక సార్లు 200కు పైగా ప‌రుగులు ఇచ్చిన‌ జ‌ట్టుగా పీబీకేఎస్ చెత్త రికార్డు
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ మ్యాచ్ టీ20 చ‌రిత్ర‌లోనే ఒక సంచ‌ల‌నం అని చెప్పాలి. ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా పంజాబ్ ఏకంగా 262 ర‌న్స్ ఛేజ్ చేసి గెలిచిన విష‌యం తెలిసిందే. అది కూడా ఇంకా 8 బంతులు మిగిలి ఉండ‌గానే మ్యాచ్‌ను ముగించింది. టీ20 క్రికెట్‌లోనే ఇదే అత్య‌ధిక ర‌న్ ఛేజ్. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక స్కోరు కూడా ఇదే. ఇక అత్య‌ధిక ర‌న్స్ ఛేజ్ చేసిన జ‌ట్ల (పురుషులు) లో పంజాబ్ కింగ్స్ త‌ర్వాత ఉన్న జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

పంజాబ్ కింగ్స్‌- 262 (వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్)
ద‌క్షిణాఫ్రికా- 259 (వ‌ర్సెస్ వెస్టిండీస్‌)
మిడిలెక్స్-253 (వ‌ర్సెస్ స‌ర్రె)
ఆస్ట్రేలియా-244 (వ‌ర్సెస్ న్యూజిలాండ్‌)
బ‌ల్గేరియా- 243 (వ‌ర్సెస్ సెర్బియా)
ముల్తాన్ సుల్తాన్స్‌- 243 (వ‌ర్సెస్ పెషావ‌ర్ జ‌ల్మి)


నిన్న‌టి మ్యాచ్‌లో న‌మోదైన న‌యా రికార్డులివే..
  • పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు-42
  • ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన జ‌ట్టుగా పంజాబ్ (24) నిలిచింది. ఇటీవల‌ స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ 22 సిక్సుల‌తో నెల‌కొల్సిన రికార్డును పంజాబ్ బ్రేక్ చేసింది.
  • సునీల్ న‌రైన్‌, ఫిల్ సాల్ట్ ఐపీఎల్ 2024లో అత్య‌ధిక భాగ‌స్వామ్యం (138) అందించిన ద్వ‌యంగా నిలిచారు.
  • పంజాబ్ విజ‌యంలో శ‌త‌కంతో కీల‌క పాత్ర పోషించిన జానీ బెయిర్ స్టోకు ఇది ఐపీఎల్‌లో రెండో శ‌త‌కం.
  • ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ పంజాబ్ త‌రఫున మూడో ఫాస్టెస్ అర్ధ శ‌త‌కం (18 బంతుల్లో) న‌మోదు చేశాడు.
  • ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్టానికి 93 ప‌రుగులు చేయ‌డం పంజాబ్‌కు ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇదే అత్య‌ధిక స్కోరు.   
పంజాబ్ కింగ్స్ పేరిట‌ చెత్త రికార్డు
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ పేరిట చెత్త రికార్డు న‌మోదైంది. ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక సార్లు 200కు పైగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న జ‌ట్టుగా నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు పంజాబ్ 28 సార్లు 200కు పైగా ర‌న్స్ ఇచ్చింది. ఆ త‌ర్వాత స్థానంలో ఆర్‌సీబీ (27), ఢిల్లీ క్యాపిట‌ల్స్ (21) ఉన్నాయి.


More Telugu News