భారత జట్టులో ఆడేందుకు ఐపీఎల్ షార్ట్‌కట్ కాదు: గౌతం గంభీర్
- ఐపీఎల్, భారత క్రికెట్, కాంట్రవర్సీలపై గౌతీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఐపీఎల్ వల్ల భారత దేశవాళీ క్రికెటర్లకు మేలు జరిగిందన్న గంభీర్
- అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా దుర్భేద్యమైన జట్టని వ్యాఖ్య
- తాను ఎందుకు సీరియస్ గా ఉంటాడో చెప్పిన భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్, భారత క్రికెట్, కాంట్రవర్సీలపై గౌతీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
"ఐపీఎల్ వల్ల భారత దేశవాళీ క్రికెటర్లకు మేలు జరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 జట్లను చూసినప్పుడు 2-3 జట్లను మినహాయిస్తే టీమిండియాతో పోటీపడే టీమ్‌లు కనిపించడం లేదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ కంటే ఐపీఎల్‌లో పోటీ పెరిగింది. అయితే, దీనివల్ల దేశవాళీ క్రికెటర్ల నాణ్యత మారిపోయింది. అందరూ ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. దాంతో ఆటోమెటిక్‌గా టీ20కి తగినట్లు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. వారి దృష్టంతా టీ20 క్రికెట్ ఆడటంపైనే కేంద్రీకృతమై ఉంటోంది. ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, టీమిండియా తరఫున ఎంత మంది యువ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారని. భారత జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి ఐపీఎల్ అనేది షార్ట్‌కట్ కాకూడదని కోరుకుంటున్నాను. వన్డే, టెస్ట్ జట్లకు ఎంపిక కావాలంటే దేశవాళీ క్రికెట్‌లో రాణించాల్సిందే" అని గంభీర్ తెలిపాడు.
అభిమానులు వచ్చేది నా జట్టు విజయం కోసం.. నా నవ్వు కోసం కాదు..
ఇక ఇదే చిట్చాట్ సెషన్లో గంభీర్ తాను ఎందుకు సీరియస్ గా ఉంటాడో కూడా వెల్లడించాడు. "చాలా మంది నన్ను ఎప్పుడూ నవ్వడని, దూకుడుగా ప్రవర్తిస్తానని, కోపంగా ఉంటానని అంటుంటారు. అభిమానులు నా నవ్వు చూడడానికి స్టేడియంకి రారు. నేను మ్యాచ్ గెలవడాన్ని చూడటానికి వస్తారు. అలాంటి ప్రొఫెషన్‌లో ఉన్నాం. మేము ఎంటర్‌టైన్‌మెంట్‌లో లేము. లేదా కార్పొరేట్‌ని కాదు. నేను బాలీవుడ్ యాక్టర్‌ని కాదు. నేను క్రికెటర్‌ని.
నేను కచ్చితంగా మ్యాచ్ గెలిచి, డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి రావాలనుకుంటాను. ఏదేమైనా విజయం సాధించినప్పుడే డ్రెస్సింగ్ రూమ్ హ్యాపీగా ఉంటుంది. నేను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించడం లేదు కదా. నేను ఎంత దూకుడుగా ఉంటానో అంతే దూకుడుగా ఉండాలనుకుంటున్నాను. అందులో తప్పేముంది? అది నా స్వభావం. ఎందుకంటే నాకు మ్యాచ్ గెలవడమనేది కీలకం. అదే నాకు ఉన్న సమస్య" అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఇక గౌతం గంభీర్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. అందులో 2011లో ఎంఎస్ ధోనీతో కలిసి వన్డే ప్రపంచకప్ గెలవడం ఒకటి. ఈ మ్యాచ్‌లో గౌతీ ఆడిన 97 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్‌ను టీమిండియా అభిమానులు ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. అటు ఐపీఎల్‌లో కూడా గౌతీ తనకంటూ గుర్తింపు పొందాడు. 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ జట్టు మెంటార్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఈసారి ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచింది.