మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ దే గెలుపు
- మార్చి 28న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
- నేడు ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్
- 109 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 28 న పోలింగ్ నిర్వహించారు. ఆదివారం మహబూబ్ నగర్ లోని జూనియర్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఐదు టేబుళ్లపై ప్రారంభమైన కౌంటింగ్.. పది గంటలకు ముగిసినట్లు సమాచారం. కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1,439 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు మినహా అందరూ ఓటేశారు. వీటిలో చెల్లని ఓట్లు 21, మిగతా వాటిలో 762 ఓట్లు నవీన్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. కాగా, నవీన్ రెడ్డి విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
హరీశ్ రావు అభినందన
నవీన్ కుమార్ కు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.