మహారాష్ట్రలో ఐఏఎస్ దంపతుల కూతురు ఆత్మహత్య
- సచివాలయం సమీపంలోని అపార్టుమెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కూతురు లిపి
- చదువుపై ఆందోళనతో బలవన్మరణానికి పాల్పడిన లిపి
- మహారాష్ట్ర విద్యాశాఖ, హోంశాఖలలో పని చేస్తున్న తల్లిదండ్రులు
ఐఏఎస్ దంపతుల 27 ఏళ్ల కూతురు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. చదువు ఒత్తిడితో ఆమె అపార్టుమెంట్‌లోని పదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దక్షిణ ముంబైలోని సచివాలయానికి సమీపంలోని సురుచి అపార్టుమెంట్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు రాధిక, వికాస్ రస్తోగిల కూతురు లిపి రస్తోగి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె గదిలో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లిపి హర్యానాలోని సోనెపట్‌లో లా చదువుతున్నారు. ఆమె తన పరీక్షల పట్ల ఆందోళనగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వివేక్ రస్తోగి మహారాష్ట్ర విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. రాధిక రస్తోగి రాష్ట్ర హోంశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. 2017లో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషాల 18 ఏళ్ల తనయుడు ఇలాగే భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.