కొత్త కాన్సెప్ట్ తో 'నమో' .. రిలీజ్ డేట్ ఇదే!
- కొత్త హీరో హీరోయిన్స్ తో 'నమో'
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా
- దర్శకుడిగా ఆదిత్య రెడ్డి పరిచయం
- జూన్ 7వ తేదీన సినిమా విడుదల
విశ్వంత్ .. అనురూప్ హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌కు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆదిత్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. అతను ఎంతో కష్టపడతాడు. మంచి టాలెంట్ ఉంది. ఆదిత్య ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటాడనిపిస్తోంది. సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ వరకు తీసుకు రావడమే గొప్ప విషయం అని అన్నారు.
విశ్వంత్ మాట్లాడుతూ.. ‘నమో నాకు కేవలం ఓ సినిమా కాదు. నాకు ఇదొక ఎమోషన్. టీం అంతా కలిసి ఎంతో సంతోషంగా పని చేశాం. ఓ ఫ్యామిలీలా కలిసి షూటింగ్ చేశాం. ఆదిత్య రాసిన పాత్రలు అద్భుతంగా వచ్చాయి. లాజిక్స్ పక్కన పెట్టి మ్యాజిక్ చూడండి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుంది" అన్నాడు.
విస్మయ శ్రీ మాట్లాడుతూ.. ‘అటవీ ప్రాంతంలో సినిమాను ఎంతో కష్టపడి షూట్ చేశాం. ప్రశాంత్ గారి నిర్మాణంలో రెండు చిత్రాలు చేశాను. మూడో సినిమా కూడా చేయబోతున్నాం. ఆదిత్య గారు బయటకు కనిపించే అంత సైలెంట్ అయితే కాదు (నవ్వుతూ). విశ్వంత్ గారు సెట్స్‌లో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. అనురూప్ మంచి ఫ్రెండ్ అయ్యారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.